ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు వినతి.

ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించని ప్రవేట్, కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)ఆధ్వర్యంలో రైల్వే కోడూరు మండల తహసీల్దార్ మోహన్ రామ్ కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా ఏబీవీపీ కడప విభాగ్ కన్వీనర్ కోడూరు మల్లికార్జున మాట్లాడుతూ ప్రవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఫిజుల రూపంలోనే కాకుండా పుస్తకాలు యూనిఫామ్ పేరుతో విద్యార్థుల నుండి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నాయని, జీవో నెం. 1 ప్రకారం పుస్తకాలు యూనిఫామ్ అమ్మకూడదు అనే నిబంధన ఉన్నప్పటికి కార్పొరేట్, ప్రవేట్ పాఠశాలలు ప్రభుత్వనిబంధనలు అతిక్రమించి కార్పొరేట్, ప్రవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

పేద మధ్యతరగతుల విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని జీవో నెం. 1 పటిష్ట పరచాలని డిమాండ్ చేశారు. విద్య అందరికి అందించాలనే ఉద్దేశ్యంతో ఫిజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని, జిల్లా డి‌ఎఫ్‌ఆర్‌సి కమిటీ సూచించిన ప్రకారం పాఠశాలలో ఫిజుల పట్టికను ఏర్పాటు చేయకుండా బ్రాండ్స్ సిబియస్ఇ, ఇ-టెక్నో, ఓలంపియాడ్ పేరుతొ అధిక ఫిజుల దోపిడీని చేయడం పాఠశాలలకు సిగ్గుచేటు అన్నారు, అటువంటి పాఠశాలపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమం చెపాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు రాజేష్ నాయక్, ప్రకాష్, షణ్ముఖ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్