విద్యార్థులు ఫీజు చెల్లించలేదనే కారణంతో ఇబ్బంది పెట్టకూడదని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్ లో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకపోవడం, ప్రాక్టికల్స్, పరీక్షలు రాయకుండా చేయడం వంటి చర్యలకు పాల్పడితే విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన వివిధ కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.