అమలాపురం: అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలి

పండుగ నేపథ్యంలో ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా మండల స్థాయి అధికారులు ముందస్తు చర్యలను చేపట్టాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ నుంచి బుధవారం డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీపం పథకం-2 ద్వారా లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లను అందించడంపై అధికారులకు సూచనలు చేశారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకొవాలన్నారు.

సంబంధిత పోస్ట్