ఎన్. టి. ఆర్. భరోసా పింఛన్ల పంపిణీ విధానం, జీవిత భాగస్వామికి వైధవ్య పింఛను మంజూరు కోసం అనుసరించు విధానములపై ప్రభుత్వం నూతన ఆదేశములు జారీచేయడం జరిగిందని కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి తెలిపారు. కాకినాడ కలెక్టరేట్ లో శుక్రవారం సాయంత్రం అధికారులతో సమీక్షించారు. పింఛనుదారులు అందుబాటులో లేకపోవడం వలన పింఛను తీసుకోలేని పింఛనుదారులకు మూడు నెలలవరకు బకాయితో పింఛనుమొత్తం చెల్లించడం జరుగుతుందన్నారు.