తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ షాన్ మోహన్ సగిలి తెలిపారు. మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలోని కోర్టు హాలులో అభ్యర్థుల సమక్షంలో నామినేషన్లు పరిశీలనచేయడంజరిగిందని, ఆరుగురు అభ్యర్థులు వేసిన నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు తెలిపారు.