కొవ్వూరు: డిసెంబర్ 14న లోక్ అదాలత్

డిసెంబర్ 14వ తేదీన జరుగు జాతీయ లోక్ అదాలత్ లో సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, వాహన ప్రమాద కేసులు రాజీ చేసుకోవడానికి కక్షి దారులు వినియోగించుకోవాలని అదనపు జిల్లా జడ్జి అనురాధ తెలిపారు. కొవ్వూరు బార్ అసోసియేషన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ జి సాయికృష్ణ, 2వ అదనపు. జూనియర్ సివిల్ జడ్జ్ కే నాగలక్ష్మి లాయర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్