ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గంలో ఆధార్ లోని సర్దుబాటు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. అయితే విద్యార్థులు ఆధార్ లో తప్పులను సరిదిద్దుకునేందుకు ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్ ల వద్ద గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. విద్యార్థుల సైతం పాఠశాలను వదిలి ఆధార్ సెంటర్ వద్ద ఎదురుచూస్తున్నారు. శుక్రవారం జి.కొండూరు జిల్లా పరిషత్ పాఠశాలలోనే ఆధార్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది.