పత్తికొండ: కొత్త చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి: ఎస్పీ

కొత్త చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పోలీసు సిబ్బందికి సూచించారు. శుక్రవారం వార్షిక తనిఖీల్లో భాగంగా డీఎస్పీ వెంకటరామయ్యతో కలిసి పత్తికొండ, జొన్నగిరి, తుగ్గలి, మద్దికెర పోలీసుస్టేషన్ లను ఆయన సందర్శించి, మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న పాత కేసులు త్వరితగతిన పరిష్కరించాలని, భూవివాదాలు, పాత కక్షలు అంశాలపై జరుగుతున్న నేరాలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్