గిద్దలూరు: రైతులకు శనగ విత్తనాలు పంపిణీ

రాయితీతో రైతులకు అందించే శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని గిద్దలూరు మార్కెట్ యార్డ్ లో శుక్రవారం ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ కిషోర్ రెడ్డి ప్రారంభించారు. మండలంలో అత్యధికంగా శనగ పంట రైతులు వేస్తారన్న సమాచారంతో 6, 800 క్వింటాల శనగ విత్తనాలు అధికారులు అందుబాటులో ఉంచారని కృష్ణ కిషోర్ రెడ్డి అన్నారు. రైతుల సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్