బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతుందని ఐఎండీ ప్రకటించింది. దీని ప్రభావంతో ఈ నెల 28, 29న విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 45 నుంచి 55 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ఓడ రేవులలో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. కోస్తాంధ్ర రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.