ఒంగోలు: 104 ఉద్యోగులు నిరసన

తమ సమస్యలను పరిష్కరించాలంటూ 104 ఉద్యోగులు, ఒంగోలులోని కలెక్టరేట్ ఎదుట ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవ అందిస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని యూనియన్ గౌరవ అధ్యక్షులు సుబ్బారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో అనేక విధాలు ఇబ్బంది పడ్డామని, నూతన ప్రభుత్వం లోనైనా తమ సమస్యలను పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్