వెలుగు కార్యాలయం ఎదురుగా మహిళా సంఘాల ఆందోళన

శింగనమల మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయం ఎదుట ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా, మహిళ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ.. మహిళ సంఘాల విఓ లీడర్లను రాజకీయ కక్షతో తొలగించడాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకులు మహిళ సంఘాల్లో జోక్యం చేసుకోవడం దుర్మార్గమని తెలిపారు.

సంబంధిత పోస్ట్