ఈ దొంగ రేంజే వేరు.. విమానంలో వ‌చ్చి చోరీ

580చూసినవారు
ఈ దొంగ రేంజే వేరు.. విమానంలో వ‌చ్చి చోరీ
తిరుపతిలోని ఎయిర్‌బైపాస్ రోడ్డులో ఉన్న వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్‌ఫర్ ఆఫీసులో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఈ దొంగతనం చేసినట్లు గుర్తించారు. అతని వద్ద నుంచి చోరీ జరిగిన సొమ్ములో రూ.6 లక్షలు రికవరీ చేశారు. నిందితుడి గురించి వివరాలు వెల్లడించిన తిరుపతి క్రైమ్ పోలీసులు.. నిందితుడు చోరీ డబ్బులలో వారం రోజుల్లోనే రెండు లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. తిరుపతికి విమానంలో వచ్చి నాలుగు రోజులు రెక్కీ నిర్వహించి మరీ చోరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్