చిత్తూరు: వరద బాధితులకు ఆర్థిక చేయూత

వరద బాధితులకు ఏపీ హెచ్ఎంల జిల్లా సంఘం నాయకులు ఆర్థిక సాయం ప్రకటించారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 86, 100 డీడీని కలెక్టర్ సుమిత్ కుమార్ కు వారు మంగళవారం అందజేశారు. బాధితులకు ఆర్థిక సాయం అందించిన సభ్యులను కలెక్టర్ అభినందించారు. చిత్తూరు డివిజనల్ ఉప విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్, జిల్లా హెచ్ఎంల సంఘం అధ్యక్షుడు అరుణ కుమార్, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, కోశాధికారి హేమాద్రి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్