వెంకటగిరి పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో జిల్లా కమిటీ సభ్యుడు చెంగయ్య ఆధ్వర్యంలో ఆదివారం సీఐటీయూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెంగయ్య మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులందరికీ ఉచితంగా గ్యాస్, డ్రైవర్లకు జీవో ఎంఎస్ 36 ప్రకారం రూ. 24,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కరోనా సమయంలో పనిచేసిన వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.