గార్గేయ నదిలో పెరిగిన నీటిమట్టం

గత వారం రోజుల నుంచి కురిసిన వర్షాలకు పుంగనూరు నియోజకవర్గం సదుం మండల పరిధిలోని కొర్లకుంటవారి పల్లి ప్రాజెక్టు నిండి మొరవ పోతోంది. మంగళవారం ఉదయం పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నిండడంతో వేకువజాము నుంచి గార్గేయ నదిలో నీటి ప్రవాహం మొదలైంది. దీంతో పలు చెరువులకు నీరు చేరనున్నట్లు రైతులు తెలిపారు. సోమల మండల కేంద్రంలో సోమవారం రాత్రి వర్షం పడింది. పిడుగుపాటుకు పలుచోట్ల గృహోపకరణాలు దగ్దమైనట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్