ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా, ఎస్సీ, ఎస్టీల విషయంలో క్రిమిలేయర్ విధానానికి నిరసనగా ఈ నెల 23న శనివారం పలమనేరు సభ జరుగుతుందని మాల మహానాడు రాష్ట్ర కార్య దర్శి అశోక్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా పుంగనూరు పట్టణంలోని మాల మహానాడు కార్యాలయంలో సమావేశమై సభ నిర్వహణపై చర్చించారు. ఆయన మాట్లాడుతూ. విద్యార్థులు, మేధావులు, మాల సంఘాల వారు అందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.