వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి వాటిని పరిష్కరించేందుకు చొరవ చూపాలని, గృహ, వ్యాపార సముదాయాలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా నిర్మాణం చేపట్టాలని అధికారులను కోరారు. ఈ సందర్బంగా గంకల కవిత అప్పారావు మాట్లాడుతూ.. గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమంలో నివాసం ఉన్న ఇళ్లకు వాడుకనీరు, మురుగునీరు పోయే మార్గం లేక ఇబ్బంది పడుతున్నామని అన్నారు. కావున రోడ్డు, కాలువలు నిర్మించాలని అక్కడి ప్రజలు కోరారని, మురుగు కాలువలు, రోడ్లు తక్షణమే నిర్మాణం చేపట్టాలని, అపరిశుభ్రత ఏర్పడడంతో ప్రస్తుతం సీజనల్ వ్యాధులు కూడా ఎక్కువైనందున చిన్న, పెద్ద అంతా వ్యాధుల బారిన పడకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఫిర్యాదు అందిందని, వీటి పై గతంలో నగర మేయర్ కు, మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని మరల మేయర్, మున్సిపల్ కమీషనర్ లను కలిసి పనులు చేపట్టమని కోరుతామని వార్డ్ ప్రజలకు గంకల కవిత అప్పారావు హామీ ఇచ్చారు. రోడ్లు, కాలువలు, మెట్లు, రక్షణ గోడ నిర్మాణం కోరుకు అధికారులతో కలిసి పర్యటించి సర్వే చెపట్టిన గంకల కవిత అప్పారావుకు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సెక్రటరీ శశిధర్, రఘు, వినయ్, పవన్ కుమార్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
అన్షుల్ కాంబోజ్‌కు రూ.3.40 కోట్లు