ప్రజా సేవలో రాజీ పడే ప్రసక్తే లేదంటున్న గంకల కవిత అప్పారావు

ప్రజా సేవలో రాజీ పడే ప్రసక్తే లేదని గ్రేటర్ విశాఖ 48వ వార్డ్ కార్పొరేటర్, జీవీఎంసీ బీజేపీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు అన్నారు. 48వ వార్డు కొండ వాలు ప్రాంతం ఏ. ఎస్. ఆర్ నగర్, ఎల్ బి నగర్, శ్రీనివాస్ నగర్ తదితర ప్రాంతాలలో గురువారం ఉదయం నుండి రాత్రి వరకు ఇంటింటా సమస్యలపై గంకల ప్రత్యేక పర్యటన చేశారు. ఈ సందర్బంగా పారిశుద్యం, విద్యుత్ సంబంధిత సమస్యలు, మంచి నీటి కొళాయి సమస్యలను తెలుసుకొని వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కార మార్గం చూపారు. ఈ సందర్భంగా ఇంటికి వెళ్లి వారి సమస్యలను గంకల కవిత అప్పారావు నేరుగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కొండవాలు ప్రాంతాల్లో రిటర్నింగ్ వాళ్ళు ఏర్పాటు చేయాలని పలువురు కోరినట్లు గంకల తెలిపారు. ఇప్పటికే పలుమార్లు జీవీఎంసీ మేయర్, కమిషనర్లకు వినతిపత్రం అందజేయడం జరిగిందని త్వరలో రిటైనింగ్ వాల్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా ప్రజరోగ్యం దృష్యా వార్డ్ సాయంత్రం వరకు ఉండి నేరుగా ఫాగ్గింగ్ పనులు చేపట్టారు. 12వ తేది జరగబోయే గిరి ప్రదక్షిణకు వార్డులో గల రోడ్డును పరిశీలించారు. ఈ సందర్బంగా గంకల కవిత అప్పారావు మాట్లాడుతూ గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమంలో ప్రజలు విధిగా వారి సమస్యలను నేరుగా తెలపవచ్చని అన్నారు. ఎటువంటి సమస్య అయినా సంబంధిత అధికారులతో తక్షణమే మాట్లాడి పరిష్కారం చూపుతామని వార్డు ప్రజలకు గంకల హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా గ్రామంలో ఇంటింటా పర్యటన చేసిన గంకల కవిత అప్పారావుకు ప్రజా శ్రేయస్సే దినచర్యగా గంకల దూసుకుపోతున్నారని వార్డ్ ప్రజలు కితాబ్ ఇచ్చార

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్