కుబీర్ మండల కేంద్రంలోని కేజీబీవీ బాలికల విద్యాలయంలో బుధవారం డా. అవినాష్, డా. సురేష్ కుమార్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ వాణి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.