అలుగు నీటిలో ట్రాక్టర్ బోల్తా

ఉట్కూరు మండలం బిజ్వార్ గ్రామ హనుమాన్ దేవుని చెరువు అలుగులో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. చెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారడంతో నీటి ఉధృతిని గమనించకుండా డ్రైవర్ ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్ళాడు. దీంతో ట్రాక్టర్ ఒక పక్కకు ఒరిగింది. అప్రమత్తమైన డ్రైవర్ ట్రాక్టర్ పై నుండి కిందికి దిగి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

సంబంధిత పోస్ట్