వనపర్తి: ఎంఈఓ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు అప్పులు తెచ్చి మరి విద్యార్థుల కడుపులు నింపుతున్నారని, కార్మికుల పెండింగ్ బిల్లులు మాత్రం 8నెలల నుంచి ఇవ్వట్లేదని ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్