అయ్యప్ప స్వామి నిత్య పూజా నియమావళి పుస్తకాన్ని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని కోరారు. నిత్య పూజా నియమావళి పుస్తకాన్ని కీర్తి శేషులు హరి గురు స్వామికి అంకితమిస్తున్నట్లు రాంమందిర్ రాజా యువజన సంఘం అధ్యక్షులు భాను ప్రకాష్ గౌడ్, సభ్యులు వెల్లడించారు.