పదేళ్ల పాలనలో వనపర్తి జిల్లా అస్తవ్యస్తం: మేఘారెడ్డి

గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో వనపర్తి నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోక అస్తవ్యస్తంగా మారిందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం పెద్దమందడిలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. రెండేళ్లలో నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు. రూ. 36 కోట్లతో పెద్దమందడి రహదారి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని వివరించారు.

సంబంధిత పోస్ట్