వనపర్తి: స్కాలర్ షిప్స్ చెల్లించాలని కలెక్టర్ కు వినతి

విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయంబర్మెంట్స్ తక్షణమే చెల్లించాలని సోమవారం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి బిఎస్ఎఫ్ నేతలు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాము మాట్లాడుతూ.. విద్యా రంగ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం విడాలని అన్నారు. 3 ఏళ్ల నుంచి ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో ఉన్నత చదువులకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం స్పందించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్