యువత సన్మార్గంలో నడవాలి

యువత సన్మార్గంలో నడవాలని వనపర్తి జిల్లా, మదనాపురం మండలానికి బదిలీ పై వచ్చిన నూతన ఎస్సై మురళి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం దంతనూర్ గ్రామాన్ని సందర్శించి గ్రామపంచాయతీ భవనం వద్ద ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ బాల్యవివాహాలు, సైబర్ క్రైమ్, ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ గురించి అవగాహన కల్పిస్తూ యువత పెడదోవ పట్టొద్దన్నారు. అవసరమైనచో 100 కు ఫోన్ ద్వారా తెలిపితే ఫోన్ చేసిన వ్యక్తి వివరాలు రహస్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో పిఏసీఎస్ వైస్ ఛైర్మన్ చీర్ల శ్రీనివాసులు, టిఆరుఎస్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి పోలీస్ సిబ్బంది నసీర్, స్వామి, చిన్నికృష్ణ, గ్రామప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్