జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ను మంత్రి సీతక్క సన్మానించారు. సోమవారం మంత్రి సీతక్క మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రపూర్ జిల్లా పర్యటనలో ఉండగా, జైనూర్ మార్కెట్ చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్ ను సత్కరించారు. రైతులకు అన్ని వేళల అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు ఉన్నారు.