జి.ఎం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రశంస పత్రాలు, బహుమతుల ప్రదానోత్సవం

జి. యం. అర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంపీపీఎస్ రామంతపూర్ తండా పాఠశాలలో ప్రతి సంవత్సరం లాగే ఈ వేసవి కాలంలో విద్యార్థులలో సృజనాత్మకత, నైపుణ్యాలు పెంపొందించేలా వేసవి శిక్షణ తరగతులను నిర్వహించడం జరిగినది. ఈ శిక్షణ శిబిరంలో విద్యార్థుల శిక్షణకు అవసరమైన పుస్తకాలను మరియు స్టేషనరీ సామగ్రి ఇచ్చి కథలు, పద్యాలు, చిత్రలేఖనం, హిందీ, స్పోకెన్ ఇంగ్లీష్, చేతిరాత, వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వడం జరిగినది అని జి. ఎం. ఆర్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్ తెలిపారు. దింతో మంచి ప్రతిభ కనబరిచిన 34 మంది పిల్లలకు ప్రశంస పత్రాలు మరియు బహుమతులను జి. యం. అర్ పోచంపల్లి హైవే ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటరమణ ముఖ్య అతిథిగా విచ్చేసి అందజేశారు. అనంతరం ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటరమణ మాట్లడుతూ చిన్ననాటి నుంచి పఠనాసక్తి పెంపొందించు కోవలని, ఎప్పుడు సమయాన్ని వృథా చేయకుండా బడిలో నేర్పించే అంశాలన్నీ శ్రద్ధగా నేర్చుకోవాలని తెలుపడం జరిగినది. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఫౌండేషన్ వాలంటీర్ శాంతిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో జి. యం. అర్ పోచంపల్లి హైవే లిమిటెడ్ ప్రతినిథులు వెంకటరమణ, లక్ష్మణా రావు, ప్రవీణ్ కుమార్, సతీష్ కుమార్ పట్నాయక్, ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నవీన్, ఉపాధ్యాయురాలు ఉదయ శ్రీ, వాలంటీర్స్ శాంతి, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్