అడవి దున్నను బైక్ ఢీకొని దంపతులకు గాయాలు

జన్నారం మండలంలోని బొమ్మెన గ్రామ సమీపంలో ఉన్న ప్రధాన రహదారిపై ప్రమాదవశాత్తు అడవి దున్నను బైక్ ఢీకొన్న ప్రమాదంలో దంపతులకు గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. లచ్చన్న, ఆయన భార్య బైక్ పై ఎల్లారంకు వెళ్లే క్రమంలో అడవి దున్నను బైక్ ఢీకొనడంతో లచ్చన్నకు తీవ్ర గాయాలు కాగా, ఆయన భార్యకు స్వల్ప గాయాలైనట్లు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్