గోదావరి తీరంలో విషాదం

మంథని మండలం, తోటగోపయ్యపల్లి గ్రామానికి చెందిన బొందుగుల రాజేందర్ (30) అనే వ్యక్తి మరణించాడు. కార్తీక మాసం సందర్భంగా గోదావరి స్నానానికి కుటుంబ సమేతంగా వచ్చారు. కానీ ప్రమాదవశాత్తు రాజేందర్ స్నానం చేస్తూ గోదావరి నది నీటిలో మునిగి మరణించాడు. కన్న వారి ఎదుటనే కొడుకు మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాన్ని మంథని ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు పూర్తి వివరాలకై దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్