దౌల్తాబాద్ మండలం శేరిపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేసి ఇటీవల బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు పాఠశాలలో ఘన సన్మానం చేసి వీడ్కోలు సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి గజ్జల కనకరాజు మాట్లాడుతూ, రవి, శ్రీనివాస్, విష్ణువర్ధన్ రెడ్డిలు ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ విద్యార్థులకు విద్యాబోధన చేసి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారని, ఇక్కడి నుంచి వారు బదిలీ కావడం చాలా బాధాకరమన్నారు.