లయన్స్ క్లబ్ అఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో 4వ డయబేటిక్ టెస్టింగ్ క్యాంపు ని పెద్దపల్లి పట్టణంలోని ఐటిఐ గ్రౌండ్ లో మంగళవారం ఏర్పాటు చేసారు. ఈ క్యాంపులో 60 మందికి షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపు లో ముఖ్య అతిథిగా మల్టీపుల్ డయబెటిస్ కో ఆర్డినేటర్ డా. రేకులపల్లి విజయ పూర్వ జిల్లా గవర్నర్ పాల్గొని డయబెటిస్ పై అవగాహనా కల్పిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.ఈ కార్యక్రమం లో లయన్ మట్ట రాంరెడ్డి, లయన్ ఆరెపల్లి కుమారస్వామి, లయన్ తాళ్ల నరేందర్, ల్యాబ్ టెక్నీషియన్ విజిత్ రావు తదితరులు పాల్గొన్నారు.