దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమై ఆ తర్వాత లాభాల్లోకి వచ్చాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 135 పాయింట్లు లాభపడి 81,282 వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు పెరిగి 24,806 వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌లో అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లోనూ, టాటాస్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లోనూ ట్రేడ్ అవుతున్నాయి.