సూపర్-8లో భారత్ ప్రత్యర్థులు అఫ్గాన్, బంగ్లా, ఆసీస్. మూడు మ్యాచుల్లోనూ భారత్ గెలిస్తే.. సెమీస్‌కు చేరుకొనేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే మాత్రం నెట్‌రన్‌రేట్ కీలకం అవుతుంది. ఈ గ్రూప్‌లో మనకు కఠిన ప్రత్యర్థి ఆసీస్. తొలి రెండు మ్యాచుల్లో ఒక్కటి ఓడినా.. మనకు ఆస్ట్రేలియాతో మ్యాచ్ ప్రిక్వార్టర్ ఫైనల్లా మారిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే వరుసగా మ్యాచులు గెలవాల్సిందే.