అమెరికాలో కాల్పులు.. భారత సంతతి మహిళ మృతి (Video)

52చూసినవారు
అమెరికా న్యూజెర్సీ రాష్ట్రంలోని మిడిల్ సెక్స్ కౌంటీలో బుధవారం ఉదయం ఇద్దరు మహిళలపై ఓ యువకుడు కాల్పులు జరిపాడు. రోడ్డు పక్కగా నడుస్తున్న వారిపై చాలా దగ్గరి నుంచి కాల్పులు జరిపి పారిపోయాడు. దీంతో భారత సంతతికి చెందిన పంజాబీ మహిళ జస్వీర్ కౌర్ (29) స్పాట్‌లోనే చనిపోగా, ఆమె సోదరి (20)కి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, కాల్పులు జరిపిన యువకుడిని గౌరవ్ గిల్‌గా పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నానికి గౌరవ్‌ను అతడి ఇంటి వద్దే అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :