విద్యాశాఖ పరిధిలోని సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, విద్యాశాఖలో విలీనం చేయాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు బుధవారం నాడు సూర్యాపేటలో తెలంగాణ తల్లి విగ్రహం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష విభాగంలో విద్యాశాఖ పరిధిలో 15 ఏళ్ల నుండి చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రములో 22,000 మంది జెజివిబిలలో, ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని గతంలో ప్రతిపక్ష నాయకుని హోదాలో సిఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలని అన్నారు.