TG: బస్సులో ప్రయాణికురాలికి అస్వస్థత.. RTC సిబ్బంది ఉదారత

HYD-కల్వకుర్తి రూట్ బస్సులో ఆదివారం నందిని అనే మహిళా ప్రయాణిస్తుండగా, బస్సు తుక్కుగూడ సమీపంలోకి వచ్చాక ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో కల్వకుర్తి డిపో కండక్టర్ శశికళ.. డ్రైవర్ అంజయ్యను అప్రమత్తం చేశారు. బస్సును ఆపించి అంబులెన్స్ కి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ లో ఆమెని కడ్తాల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం నందిని ఆరోగ్యం నిలకడగా ఉంది. కండక్టర్ శశికళ, డ్రైవర్ అంజయ్యను TGSRTC ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్‌ ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్