రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంచోర్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఓ బైక్ను అతివేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.