ఓ మహిళ తన కుటుంబం కోసం ఎంత కష్టపడుతుందో చూపించే వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఓ మహిళ ప్రముఖ ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫాం జొమాటోలో పనిచేస్తూ ఫుడ్ డెలివరీ చేస్తోంది. అయితే విశేషం ఏంటంటే ఆమె తన బిడ్డను కూడా తనతో పాటు తీసుకెళ్తూ ఫుడ్ డెలివరీ చేస్తోంది. అయితే ఓ వ్యక్తి ఆమెను ప్రశ్నించగా, తాను హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థిని అని, పెళ్లయిన తర్వాత తనకు ఉద్యోగం దొరకడం కష్టంగా మారిందని చెప్పింది.