అందుకే కులగణన కీలకం: రాహుల్ గాంధీ

దేశ సంపద సమానంగా పంచాలంటే దేశం మొత్తం కులగణన సర్వే చాలా కీలకమని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణలో జరిగే కులగణన దేశానికే ఆదర్శమన్నారు. దేశంలో కులవివక్ష కొనసాగుతోందని, కులం విషయంలో ఓ విజన్‌తో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. దేశాన్ని విభజించే కుట్ర చేస్తున్నానని ప్రధాని మోదీ అంటున్నారు.. దేశం గురించి నిజం చెబితే దేశాన్ని విభజించడం అవుతుందా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్