దూర‌దృష్టితో స‌ర్వే చేప‌ట్టాం: మంత్రి పొంగులేటి

TG: గత ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్‌ ప్రభుత్వం సరిదిద్దుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘మంచి ప్రతిపక్షంగా విలువైన సూచనలు ఇస్తే.. స్వీకరిస్తాం. ఎంతో దూరదృష్టితో సర్వేను చేపట్టాం. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ పనిని కూడా కక్షపూరితంగా చేయడం లేదు. గత ప్రభుత్వంలోని నేతలు చేసిన అక్రమాలపై చట్టపరంగానే చర్యలుంటాయి’’ అని పొంగులేటి అన్నారు.

సంబంధిత పోస్ట్