భువనగిరి: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం

పేద ప్రజలపై విద్యుత్ చార్జీల భారం పడకుండా విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరస్కరించారు. ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతూ బుధవారం భువనగిరి జిల్లా కేంద్రంలో అభినందన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షించారు.

సంబంధిత పోస్ట్