యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పెద్ద పడిశాల గ్రామపంచాయతీ సిబ్బంది అల్లే భిక్షం గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాలేక సోమవారం ఉదయం కనుమూయడం జరిగింది. అల్లే బిక్షం కుటుంబానికి చేయూత సాయంగా పెద్ద పడిశాల గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు రూ..10000 ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు ఆకుల ఆంజనేయులు ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షుడు ఆకుల ఉదయ్, మాజీ ఎంపీటీసీ మటగజ్జ లింగమల్లు, జక్కుల శీను, రాగం శీను, తదితరులు పాల్గొన్నారు.