సజ్జల కుటుంబానికి 2 ఓట్లు.. టీడీపీ ఫిర్యాదు

72చూసినవారు
సజ్జల కుటుంబానికి 2 ఓట్లు.. టీడీపీ ఫిర్యాదు
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కుటుంబానికి రెండు ఓట్లు ఉండటంపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. సజ్జల కుటుంబానికి మంగళగిరి, పొన్నూరు రెండు నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయని తెలిపారు. వాటికి సంబంధించిన ఆధారాలను ఫిర్యాదు లేఖతో జతచేశారు. సజ్జల కుటుంబం డబుల్ ఓట్ల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.

ట్యాగ్స్ :