బాలకార్మిక వ్యవస్థకు అసలు కారణం పేదరికమే. వారు చదువుకోవాల్సిన వయసులో పనిచేస్తున్నారు. వ్యవసాయంలోనూ, ఇతరత్రా పనుల్లో తల్లిదండ్రులకు సాయంగా వెళ్ళేవారు కొందరైతే, మరికొందరు దుకాణాల్లో, ఇతర పనుల్లోకి వెళుతున్నారు. తల్లిదండ్రుల అవగాహనా రాహిత్యంతో చట్టాలు అమలు కావడం లేదనే వాదన కూడా మరో వైపు వినిపిస్తోంది. చదువుకోవాలని పిల్లలను వాళ్ల తల్లిదండ్రులు ప్రోత్సహించిన నాడే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనవుతుంది.