దక్షిణ గాజాలో ఆహార పంపిణీ నిలిపివేత

69చూసినవారు
దక్షిణ గాజాలో ఆహార పంపిణీ నిలిపివేత
సెంట్రల్ గాజాలో అమెరికా నిర్మించిన ఫ్లోటింగ్ డాక్ ద్వారా ఆహార పంపిణీని నిలిపివేసినట్లు ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) తెలియజేసింది. తమ సిబ్బంది భద్రతపై ఆందోళనలు తలెత్తడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. WFP గోదాముల సముదాయంపై రాకెట్ల దాడి జరిగిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఇజ్రాయెల్ కావాలనే ఆహార సరఫరాలను అందనివ్వడం లేదని ఐక్యరాజ్యసమితి విమర్శించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్