ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. ఖరీఫ్ సీజన్ కోసం ఈ నెల 20 నుంచి సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు 6.19 లక్షల క్వింటాళ్ల విత్తనాల్ని సిద్ధం చేశారు. ఇందుకు రూ.450 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం.. రూ.195 కోట్ల సబ్సిడీ భరించనుంది. పచ్చిరొట్ట, చిరుధాన్యాల విత్తనాలపై 50 శాతం, వేరుశనగపై 40 శాతం సబ్సిడీ ఇవ్వనుంది.