ఒడిశాలోని భువనేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ ఆర్మీ అధికారికి కాబోయే భార్య లైంగిక వేధింపులకు గురైంది. ఆమె చిన్న వివాదం కారణంగా పోలీస్ స్టేషన్ కి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కొంతమంది యువకులు పోలీస్ స్టేషన్ లోనే ఆమెను చుట్టిముట్టి లైంగిక వేధింపులకు గురి చేశారు. ఇక్కడ సీఎం మోహన్ చరణ్ మాఝీ మీకు తెలుసా అంటూ రెచ్చిపోయారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.