అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనలో మరణాల సంఖ్య ఏడుకు చేరింది. ఇది మరింత పెరిగే అవకాశముంది. పేలుడు సమయంలో విధుల్లో 300 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఫస్ట్ ఫ్లోర్‌లో పైకప్పు కూలడంతో కొందరు చిక్కుకున్నట్లు కార్మికులు తెలిపారు. పేలుడు ధాటికి సిబ్బంది శరీర భాగాలు ఛిద్రమైనట్లు పేర్కొన్నారు.