రాష్ట్ర ప్రభుత్వం రాబోయే 4నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై బుధవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆగస్టు నుంచి నవంబరు వరకు అవసరమైన ఖర్చుల అంచనాలను గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదించారు. ఈ 4నెలలకు గాను మొత్తం రూ.1,29,972కోట్ల వ్యయం అంచనాలతో ఆర్డినెన్సు జారీ చేశారు. ప్రభుత్వం కొత్తగా రావడం.. గత సర్కారు చేసిన ఆర్థిక నష్టాలపై ఒక స్పష్టతకు వచ్చాకే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావించినట్లు ఆర్డినెన్స్‌లో సర్కారు పేర్కొంది.